“ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కోసం ‘స్వచ్ఛ సంకల్ప దీక్ష’”–మున్సిపల్ కమిషనర్

  –ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కోసం స్వచ్ఛ సంకల్పం   –ఆగస్టు 15న వేలాది మందితో జనసంకల్ప కార్యక్రమం   సలాం ప్రొద్దుటూరు: ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరును ఆవిష్కరించేందుకు ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రజా భాగస్వామ్యంతో ‘స్వచ్ఛ సంకల్ప దీక్ష’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్య నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ వినియోగాన్ని పట్టణం నుంచి పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.   ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్‌ గ్రౌండ్‌లో...