దేశభక్తిని చాటిన తిరంగా ర్యాలీ..

సలాం   ప్రొద్దుటూరు: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచింది. శ్రీనివాసనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి శివాలయం సర్కిల్ వరకు సుమారు 100 మీటర్ల భారీ జాతీయ జెండాతో నిర్వహించిన ఈ ర్యాలీ ప్రజల్లో స్ఫూర్తిని నింపింది.   జాతీయ జెండాలను చేతబూని “భారత్ మాతాకీ జై”, “వందే మాతరం”, “జై హింద్” వంటి దేశభక్తి నినాదాలతో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు....