SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 1:00 pm Posted by : SALAM PRODDATUR

30వ వార్డులో  డోర్ టూ డోర్ కార్యక్రమం

సలాం  ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే  నంద్యాల వరదరాజుల రెడ్డి,  నంద్యాల కొండారెడ్డి  ఆదేశాల మేరకు 30వ వార్డులో డోర్ టూ డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

ఈ సందర్భంగా 30వ వార్డులోని బూత్ నంబర్లు 187, 188 పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు పార్టీ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో 30వ వార్డు ఇంచార్జిలు నాగేంద్ర, శ్రీకాంత్, సురేష్, అలాగే ఆంజనేయులు, హర్ష, స్వామి, రామకృష్ణ, శివ, మురళీ, బాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.