శభాష్ పోలీస్.. సీసీ కెమెరాలతో రూ.10 లక్షల బంగారు నగలు గుర్తింపు
సలాం ప్రొద్దుటూరు: ఆటోలో ప్రయాణిస్తుండగా అనుకోకుండా కిందపడిపోయిన సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్‌ను ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీసులు చాకచక్యంగా గుర్తించి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల సమయస్ఫూర్తి, సీసీ కెమెరాల వినియోగంపై ప్రజలు అభినందనలు వ్యక్తం చేశారు. నేతాజీ నగర్‌కు చెందిన ఎస్.కె. ప్యారిజాన్ (70) ఈ రోజు న ( గురువారం) ఆటోలో ఇంటి నుంచి ప్రొద్దుటూరు పాత బస్టాండ్‌కు వెళ్తుండగా, మార్గమధ్యంలో ఆమె వద్ద ఉన్న బ్యాగ్ ఆటో నుంచి జారిపడిపోయింది. పాత...