SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 6:37 pm Posted by : SALAM PRODDATUR

రెండేళ్ల కూటమి పాలనలో అడుగడుగునా అభివృద్ధి, సంక్షేమం

 

 

సలాం ప్రొద్దుటూరు:

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న డోర్‌ టు డోర్‌ కార్యక్రమం కొనసాగుతోంది.

 

కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, నంద్యాల కొండారెడ్డి గారి సూచనలతో 34వ వార్డు ఇన్‌చార్జి జి. సుబ్బమ్మ ఆధ్వర్యంలో 34వ వార్డులోని 125వ బూత్‌ పరిధిలో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను తెలియజేస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 

కార్యక్రమంలో 34వ వార్డు కూటమి నాయకులు మదర్సాబ్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు నల్లధిమి కుమారి, బూత్‌ ఇన్‌చార్జి, కూటమి నాయకులు, కేఎస్‌ఎస్‌ సభ్యులు మల్లికార్జున, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.