మార్కెట్ యార్డు కమిటీ ఇన్‌చార్జ్ ఛైర్మన్‌గా పట్నం లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం
–ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో బాధ్యతల స్వీకరణ సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ ఇన్‌చార్జ్ ఛైర్మన్‌గా పట్నం లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటివరకు ఛైర్మన్‌గా ఉన్న వద్ది సురేఖ బాలుడు అనారోగ్య కారణాలతో రాజీనామా చేయడంతో, వైస్ ఛైర్మన్‌గా ఉన్న పట్నం లక్ష్మణ్‌కు ఇన్‌చార్జ్ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో...