SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 3:15 pm Posted by : SALAM PRODDATUR

36వ వార్డులో ఘనంగా ఇంటింటి టీడీపీ ప్రచారం

సలాం ప్రొద్దుటూరు:

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి ఆదేశాల మేరకు 36వ వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు, వార్డు మాజీ కౌన్సిలర్ సోమా బాలయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.

 

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నాయకులు సూచించారు.

 

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, శివాలయం డైరెక్టర్ సోమా తిరుమలనాథ్, డీలర్లు సోమా నాగరాజు, చెన్న ప్రసాద్, ఎలకంటి నరసింహులు, సానా చౌదయ్య, కొత్తపల్లి బాలాజీ, పల్లా రామాంజినేయులు, మడూరు బాల నరసింహులు, పల్లా సత్యనారాయణ, బడిగించాల హరి, తనికంతి వెంకట సుబ్బయ్య (రాజా), వల్లెపు వెంకటయ్య, వంకం నాగార్జున, పోలిచెర్ల ప్రకాష్, కుమార్, శివతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.