రెండేళ్ల కూటమి పాలనలో అడుగడుగునా సంక్షేమం, అభివృద్ధి
సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 2వ వార్డులో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ఇన్‌చార్జి ద్వారకచర్ల రాఘవరెడ్డి, నాగమునిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. స్థానిక నాయకులు సుబ్బారెడ్డి, నాగిరెడ్డి, డి. గంగా...