నకిలీ కారుణ్య నియామకాల మోసం ఛేదించిన కడప పోలీసులు
సలాం ప్రొద్దుటూరు ( కడప): కారుణ్య నియామకాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసిన నకిలీ ఉద్యోగ నియామకాల వ్యవహారాన్ని కడప పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేసినట్లు కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో...