కాంగ్రెస్‌లో చేరండి.. ప్రజా సంక్షేమంలో భాగస్వాములు కండి
సలాం ప్రొద్దుటూరు: ప్రజా సమస్యల పరిష్కారం, పేదలు–సామాన్య ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని పిలుపునిస్తూ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ ప్రజా చేరికల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 41వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో వెంకట సుబ్బయ్య తన కుటుంబ సభ్యులు, ఇతరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయజ్యోతి, ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాషా వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు...