ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు
సలాం ప్రొద్దుటూరు (అమరావతి): ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాలను 2026 సెప్టెంబర్ 3న ప్రచురించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ నెం. 401/SEC-F1/2026-1 ద్వారా ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఈ ఓటర్ల జాబితాలను ప్రామాణికంగా ఉపయోగించనున్నారు. అలాగే మేయర్, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేసే ప్రక్రియలోనూ ఈ జాబితాలు కీలకంగా ఉండనున్నాయి. 2026 జనవరి 1ను అర్హత...