అంతర్జాతీయ శిక్షణకు ఎంపికై కడప జిల్లా ఖ్యాతిని చాటుతున్న ఉపాధ్యాయురాలు

  సలాం ప్రొద్దుటూరు: గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తూ అంతర్జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమానికి ఎంపికై కడప జిల్లా ఖ్యాతిని చాటుతున్న షేక్ జవహర్ మునీర్ ను మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి బుధవారం ఘనంగా సన్మానించి అభినందించారు.   ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ లింగారెడ్డినగర్ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న షేక్ జవహర్ మునీర్, ఫిన్లాండ్‌లో ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న FLN శిక్షణ కార్యక్రమానికి ఎంపికయ్యారు. విద్యార్థుల్లో ప్రాథమిక...