SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 8:59 pm Posted by : SALAM PRODDATUR

శ్రీనివాసనగర్‌లో టీడీపీ ‘డోర్ టు డోర్’

 

 

–బూత్‌ల వారీగా ఇంటింటి ప్రచారం..

–ప్రజా సమస్యలపై ఆరా

 

సలాం  ప్రొద్దుటూరు:

తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చేపడుతున్న ప్రజా కార్యక్రమాల్లో భాగంగా శ్రీనివాసనగర్ పరిధిలో 79, 82, 88వ బూత్‌లలో ‘డోర్ టు డోర్’ కార్యక్రమం   మంగళవారం  నిర్వహించారు.

 

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, నంద్యాల కొండారెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయా బూత్‌ల పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి కృషి చేయడమే డోర్ టు డోర్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. పార్టీ కార్యకర్తలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.

 

కార్యక్రమంలో వార్డు నాయకులు కొర్పాడు రఫీ, షఫీ, మహబూబ్ ఖాన్, గఫార్, ఖదీర్, ఫర్వేజ్, తౌసీఫ్, షరీఫ్, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.