రామలింగ చౌడేశ్వరి అమ్మవారి పుట్టినరోజు ఉత్సవాలకు మున్సిపల్ కమిషనర్‌కు ఆహ్వానం
సలాం ప్రొద్దుటూరు: శ్రీ శ్రీ శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారి పుట్టినరోజు ఉత్సవాలను పురస్కరించుకుని ప్రొద్దుటూరు పట్టణంలోని హనుమాన్‌నగర్ బస్తీలో వెలసిన శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవాలయంలో నిర్వహించనున్న ఉత్సవాలకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ దేవాంగను దేవాలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రాగా నరసింహారావుతో పాటు దేవాలయ కమిటీ సభ్యులు రాగా పెద్ద నరసింహులు, గిద్దలూరు దద్దనాల సుబ్బారాయుడు, దేవరశెట్టి కొండయ్య, అల్లి...