SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 11:34 pm Posted by : SALAM PRODDATUR

రామలింగ చౌడేశ్వరి అమ్మవారి పుట్టినరోజు ఉత్సవాలకు మున్సిపల్ కమిషనర్‌కు ఆహ్వానం

 

సలాం   ప్రొద్దుటూరు:

శ్రీ శ్రీ శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారి పుట్టినరోజు ఉత్సవాలను పురస్కరించుకుని ప్రొద్దుటూరు పట్టణంలోని హనుమాన్‌నగర్ బస్తీలో వెలసిన శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవాలయంలో నిర్వహించనున్న ఉత్సవాలకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ దేవాంగను దేవాలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు.

 

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రాగా నరసింహారావుతో పాటు దేవాలయ కమిటీ సభ్యులు రాగా పెద్ద నరసింహులు, గిద్దలూరు దద్దనాల సుబ్బారాయుడు, దేవరశెట్టి కొండయ్య, అల్లి చంద్రశేఖర్ తదితరులు మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాల వివరాలను తెలియజేసి, అమ్మవారి పుట్టినరోజు వేడుకలకు హాజరై ఆశీర్వాదం పొందాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.

 

అమ్మవారి పుట్టినరోజు ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు సభ్యులు తెలిపారు.