ప్లాస్టిక్‌ రహిత ప్రొద్దుటూరే మా ప్రధాన లక్ష్యం–ఎమ్మెల్యే వరద

  –స్వచ్ఛ సంకల్ప దీక్షతో ప్రజల్లో చైతన్యం..   –10 వేల మందితో భారీ కార్యక్రమం...   సలాం  ప్రొద్దుటూరు:   ప్రొద్దుటూరు పట్టణాన్ని పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్ది ప్లాస్టిక్‌ రహిత ప్రొద్దుటూరుగా మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రజల భాగస్వామ్యంతో నిరంతర కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.   ప్రొద్దుటూరు పురపాలక సంఘం కార్యాలయంలో ‘స్వచ్ఛ సంకల్ప దీక్ష–ప్లాస్టిక్‌ రహిత ప్రొద్దుటూరు’ అడ్వైజరీ కమిటీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న...