SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 8:44 pm Posted by : SALAM PRODDATUR

కూటమి పాలనతోనే ప్రొద్దుటూరు అభివృద్ధి –ఎమ్మెల్యే వరద

–ప్రజల ముంగిటకు సంక్షేమ పథకాలు..

–29వ వార్డులో ఎమ్మెల్యే వరద ఇంటింటి ప్రచారం

 

సలాం  ప్రొద్దుటూరు:

కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రజలకు వివరించేందుకు చేపట్టిన ‘2 ఏళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా 11వ రోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. ముఖ్యంగా చేనేత వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతను వివరించారు.

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చేనేత వర్గాలకు రూ.25 వేల ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని నాయకులు ప్రస్తావించారు. చేనేత కుటుంబాల ఇళ్లకు వెళ్లి ఆర్థిక సహాయం వారి ఖాతాల్లో జమ అయిన విషయాన్ని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, వారి స్పందనను నమోదు చేశారు.

 

ఇంటింటికీ సంక్షేమ పథకాలపై అవగాహన

 

నేతన్న నేస్తం, తల్లికి వందనం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం–2, ఎన్టీఆర్ భరోసా, ఆటో డ్రైవర్ల సేవలో, అన్నా క్యాంటీన్లు తదితర పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ఇంటింటికీ వెళ్లి వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వివిధ వర్గాలకు కలుగుతున్న ప్రయోజనాలను ప్రజలకు తెలియజేశారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అన్ని వర్గాల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ప్రజల వద్దకే వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు స్థానిక సమస్యలను తెలుసుకోవడమే ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.

 

కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్, ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు కొండవీటి భావన, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహమ్మద్, టీడీపీ కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబిఉల్లా, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసుల రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

అలాగే టీడీపీ నాయకులు తలారి పుల్లయ్య, బొగ్గుల సుబ్బారెడ్డి, వంగల నారాయణరెడ్డి, ఈవీ సుధాకర్ రెడ్డి, చింతకుంట కుతుబుద్దీన్, ఖలీల్ భాష, జనసేన నాయకులు జిలాన్, దేవస్థాన ధర్మకర్తలు ప్రసాద్, రామారావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

 

స్థానిక నాయకులు జింకా రామకృష్ణ, పట్టుపోగుల మధు, ఉమ్మడిశెట్టి కుమార్, దూలబండి సురేంద్ర, వాసి రవీంద్రబాబు, మోతుకూరి బాల, ఉమ్మడిశెట్టి శంకర్, ఉదయ్, సురేష్, చౌడయ్య, శీను, రమణయ్య, నాగేష్, పవన్, శివ, నారాయణస్వామి, జింకా గురుస్వామి, సి.వి. రమణ, ఆంజనేయులు, శ్రీకాంత్, బాలు తదితరులు పాల్గొన్నారు.