–నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన పార్టీ నేతలు..
–పనులు వేగవంతం చేయాలని సూచన
సలాం ప్రొద్దుటూరు (కడప ):
కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నూతనంగా నిర్మించనున్న జిల్లా ప్రధాన కార్యాలయ నిర్మాణ స్థలాన్ని టీడీపీ నాయకులు సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు, స్థల అభివృద్ధి పనులను నాయకులు పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి, నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత సభ్యులతో చర్చించారు.
జిల్లా స్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు నూతన కార్యాలయం కీలకంగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాన్ని అన్ని సౌకర్యాలతో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా టీడీపీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబివుల్లా మాట్లాడుతూ పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం, ప్రజలకు మరింత చేరువగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించేందుకు నూతన జిల్లా కార్యాలయం ఉపయోగపడుతుందని అన్నారు. నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా, వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
“కార్యకర్తలే పార్టీకి బలం.. ప్రజల నమ్మకమే టీడీపీకి అండ” అని ఆయన పేర్కొన్నారు.