–ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన
సలాం మైదుకూరు:
మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు మైదుకూరు మున్సిపాలిటీ 6వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో “ఇంటింటికి టీడీపీ” కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.
టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి రాకెట్ రఫీ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, వారి సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ నాయకులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జ్ పెద్దయ్య, 5వ వార్డు ఇన్‌చార్జ్ షేక్ అల్తాఫ్ హుస్సేన్, ITDP నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్ ఆసీఫ్ హుస్సేన్, తెలుగు యువత ఉపాధ్యక్షులు శివరామ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.