వైఎస్సార్‌సీపీ నిరసనకు పోలీసుల అడ్డంకులు

  –గాంధీపార్క్ వద్ద ఉద్రిక్తత.. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు   సలాం  ప్రొద్దుటూరు: డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు గాంధీపార్క్ వద్ద నిరసన చేపట్టేందుకు తరలివచ్చారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.   ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు వచ్చిన తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం...