ప్రజల ఆరోగ్యంపై ఏపీఎన్జీవోస్‌ శ్రద్ధ.. సేవలు భేష్‌ అంటున్న ప్రజలు

–ఏపీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి విశిష్ట స్పందన –సేవలను అభినందించిన ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి సలాం ప్రొద్దుటూరు: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఉద్యోగ సంఘాలు కూడా సామాజిక బాధ్యతగా ముందుకు రావాలనే సందేశాన్ని ఏపీఎన్‌జీవోస్‌ అందించింది. ఉద్యోగుల సంక్షేమంతో పాటు సమాజ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ ప్రొద్దుటూరులో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి సేవా స్ఫూర్తిని చాటుకుంది. ప్రొద్దుటూరు తాలూకా ఏపీఎన్‌జీవోస్‌ అసోసియేషన్‌, హోలిస్టిక్‌ హాస్పిటల్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్‌జీవో హోమ్‌లో నిర్వహించిన ఈ శిబిరంలో 180 మంది ప్రజలకు...