కష్టకాలంలో వెంకటరమణ కుటుంబానికి ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అండ
–మున్సిపల్ కార్మికుడి మృతికి సంతాపం.. అంత్యక్రియల ఖర్చులకు రూ.20 వేల సాయం సలాం ప్రొద్దుటూరు: కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలవడమే ప్రజా ప్రతినిధిగా తన బాధ్యత అని చాటుతూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మానవీయతను చాటుకున్నారు. పురపాలక సంఘంలో సేవలందిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన వెంకటరమణ కుటుంబానికి ఆయన అండగా నిలిచారు. వెంకటరమణ మృతి విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అంత్యక్రియల ఖర్చుల కోసం...