సయ్యద్ ఎహ్సానుల్లా హుస్సైనీ ఖాద్రి సాహెబ్ ఆధ్యాత్మిక ప్రస్థానం..
–వారసత్వం నుంచి ప్రపంచ మానవతా సందేశం వరకు.. సలాం ప్రొద్దుటూరు ప్రత్యేక కథనం – బి.ఎస్. ఖాజా మొహిద్దిన్ కొన్ని ప్రయాణాలు ఒక వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబ వారసత్వాన్ని, ఒక పట్టణ ప్రతిష్ఠను, ఒక సంప్రదాయం పట్ల ప్రపంచ దృష్టిని కూడా కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. అలాంటి ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తున్నారు ప్రొద్దుటూరు ఆస్థానే కమాలియా బిరాదరే పీఠాధిపతి సయ్యద్ ఎహ్సానుల్లా హుస్సైనీ ఖాద్రి సాహెబ్. ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఉన్న హజ్రత్ సుల్తాన్ అల్ అవులియా హజ్రత్ సయ్యద్ అబ్దుల్ ఖాదిర్...