లింగాపురంలో ఎమ్మెల్యే డోర్ టు డోర్..
సలాం ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన సందర్భంగా నిర్వహిస్తున్న “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని లింగాపురం గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని లింగాపురం గ్రామంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని...