
సలాం ప్రొద్దుటూరు:
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన సందర్భంగా నిర్వహిస్తున్న “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని లింగాపురం గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని లింగాపురం గ్రామంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కూటమి పాలనలో సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం లింగాపురంలో ఉన్న టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి స్వగృహానికి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి, రాఘవ రెడ్డి ల ను కుటుంబ సభ్యులతో కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, లింగాపురం సొసైటీ చైర్మన్ సిద్ధారెడ్డి నాగముని రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసాం రఘురామి రెడ్డి, ఏఓ వరహరి తదితరులు పాల్గొన్నారు.

