మెగా డీఎస్సీపై దుష్ప్రచారానికి చెక్.. అభ్యర్థుల ఆత్మగౌరవ గర్జన!
–నియామకాలు పొందిన అభ్యర్థులే రోడ్డెక్కారు.. –తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఛలో కర్నూలు సలాం ప్రొద్దుటూరు : మెగా డీఎస్సీ–2025 నియామకాలపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలకు తెరదించేందుకు అభ్యర్థులు స్వయంగా రంగంలోకి దిగారు. తమకు లభించిన ఉపాధ్యాయ ఉద్యోగాలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ‘ఆత్మగౌరవ ర్యాలీ’ నిర్వహించేందుకు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి 42 మంది మెగా డీఎస్సీ అభ్యర్థులు కర్నూలుకు తరలివెళ్లారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించిన ఆత్మగౌరవ ర్యాలీలో పాల్గొని మెగా డీఎస్సీ నియామకాలపై...