ప్లాస్టిక్‌పై పోరుకు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ శ్రీకారం..
–‘టార్గెట్ 10,000 షాప్స్’తో ప్రత్యేక డ్రైవ్.. –200 మంది సిబ్బంది, 12 బృందాలతో విస్తృత తనిఖీలు సలాం ప్రొద్దుటూరు: “మన పట్టణం.. మన బాధ్యత.. ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు మన సంకల్పం” అనే నినాదంతో ప్రొద్దుటూరు పురపాలక సంఘం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘టార్గెట్ 10,000 షాప్స్’ పేరుతో శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీకి చెందిన సుమారు 200 మంది సిబ్బందిని 12 ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి...