ప్రొద్దుటూరులో రెండో రోజూ కొనసాగిన వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు
–డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, నిరుద్యోగ భృతి తదితర డిమాండ్లపై ఆందోళన సలాం ప్రొద్దుటూరు: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, నిరుద్యోగ భృతి కల్పించాలని తదితర డిమాండ్లతో ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజూ కొనసాగాయి. మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు ఎదుట నిర్వహిస్తున్న ఈ దీక్షలకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు.రెండో రోజు దీక్షలో రాజుపాలెం మండలానికి చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, యువకులు,...