పేదల ఆరోగ్యమే లక్ష్యం.. ఉచిత మెగా వైద్య శిబిరానికి ఎమ్మెల్యే హామీ
–సేవా స్ఫూర్తితో హారిక హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా క్యాంప్.. –ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సలాం ప్రొద్దుటూరు: ఆర్థిక పరిస్థితులు వైద్యానికి అడ్డంకిగా మారకూడదనే మానవతా దృక్పథంతో ప్రొద్దుటూరులో ఉచిత మెగా వైద్య శిబిరానికి శ్రీకారం చుట్టారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యం, వైద్య పరీక్షలు భారంగా మారుతున్న నేపథ్యంలో వారికి ఉచితంగా వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీజే రాయలసీమ ఇన్‌చార్జ్ డా. అయూబ్...