డీఎస్సీ అక్రమాలపై పోరాడితే అరెస్టులా..?

–రామసుబ్బారెడ్డి అరెస్టుపై  భగ్గుమన్న   వైఎస్సార్‌సీపీ –రాజకీయ కక్ష సాధింపులు ఆపాలి.. –ప్రజాస్వామ్య హక్కులను కాలరాయొద్దు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సలాం ప్రొద్దుటూరు   (జమ్మలమడుగు): రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరుగుతున్న అక్రమాలపై నిరసన వ్యక్తం చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షల నేపథ్యంలో జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అరెస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నేతలను అరెస్టులతో అణచివేయాలని చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్సీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న...