SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 1:30 pm Posted by : SALAM PRODDATUR

మెగా కాదు.. దగా డీఎస్సీ –రాచమల్లు

 

–DSC అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ రిలే దీక్షలు ప్రారంభం

సలాం ప్రొద్దుటూరు:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరులో రిలే నిరాహార దీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. స్థానిక మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు ఎదురుగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడారు.  మెగా డీఎస్సీ ను కూటమి ప్రభుత్వం దగా డీఎస్సీ చేశారని ఆయన ఆరోపించారు. ₹ లక్షల రూపాయలు కు ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలలో అవినీతి చేయడంవల్ల నిజంగా చదువుకున్న పేద మధ్యతరగతి చెందిన లక్షలాదిమంది విద్యార్థులు నిరాశ చెందుతారని ఆయన ఆవేదం వ్యక్తం చేశారు.

డీఎస్సీ నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగులకు హామీ ఇచ్చిన మేరకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అమలు చేయాలని దీక్షలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు.

రిలే దీక్షల తొలి రోజు ప్రొద్దుటూరు ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్ అధ్యక్షత వహించారు. సోములవారిపల్లె పంచాయతీకి చెందిన పలువురు ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేసి నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్సీపీ నాయకులు ఈ సందర్భంగా కోరారు.