ప్రొద్దుటూరును విషాదంలో ముంచిన సూఫీ ఆధ్యాత్మిక గురువు సయ్యద్ షా ఇర్ఫానుల్లా హుసైనీ ఖాద్రీ సాహెబ్ మృతి
–ఆస్థాన-ఏ-కమాలియా బిరాదర్-ఎ-సజ్జాదా నషీన్‌కు భక్తులు, శిష్యుల కన్నీరుమున్నీరు – నేడు జుమ్మా నమాజ్ అనంతరం అంతిమయాత్ర సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులోని ఆధ్యాత్మిక వర్గాలను, వేలాది మంది భక్తులను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ ఆస్థాన-ఏ-కమాలియా బిరాదర్-ఎ-సజ్జాదా నషీన్ హజ్రత్ సయ్యద్ షా ఇర్ఫానుల్లా హుసైనీ ఖాద్రీ సాహెబ్ గురువారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచిన వార్త తెలిసిన క్షణం నుంచే కుటుంబ సభ్యులు, శిష్యులు, ఆప్తులు, భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుర్రంకొండలోని ప్రసిద్ధ సూఫీ పీఠం హజ్రత్...