SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 4:30 pm Posted by : SALAM PRODDATUR

ఎల్ నినో పరిస్థితులపై సమీక్ష.. ప్రత్యామ్నాయ సన్నద్ధత చర్యలకు ప్రాధాన్యం

 

–కడప కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

 

సలాం ప్రొద్దుటూరు  ( కడప):

జిల్లాలో సంభవించే ఎల్ నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ సన్నద్ధత చర్యలపై జిల్లా కలెక్టరేట్‌లోని PGRS హాలులో గురువారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు.

 

సమావేశంలో ముందుగా జిల్లాలో ప్రస్తుత ఎల్ నినో పరిస్థితులు, వర్షపాతం స్థితి, భూగర్భ జలాల లభ్యత, జలాశయాల్లో నీటి నిల్వలు, ఖరీఫ్ సాగు పరిస్థితులు, ప్రభుత్వం చేపడుతున్న నివారణ చర్యలపై జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు.

 

అనంతరం సంబంధిత శాఖల జిల్లా అధికారులు ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించేందుకు అమలు చేస్తున్న ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక, వివిధ శాఖల సమన్వయం, ముందస్తు సన్నద్ధత చర్యలు, రైతులు మరియు ప్రజలకు అందించనున్న సేవలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

 

ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి నిధిమీనా, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.