ఆగస్టు 15 నాటికి ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు లక్ష్యం–ఎమ్మెల్యే

–ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ పట్టణం సాధ్యం   –మెప్మా ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ – ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలకు చైతన్యం   సలాం   ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరును పూర్తిస్థాయి ప్లాస్టిక్ రహిత, స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే ఈ లక్ష్యాన్ని విజయవంతంగా సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.ప్రొద్దుటూరు పురపాలక సంఘం మెప్మా ఆధ్వర్యంలో గురువారం అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ నుంచి శివాలయం సెంటర్ వరకు నిర్వహించిన ప్లాస్టిక్ వ్యతిరేక అవగాహన ర్యాలీలో...