సంక్షేమం–అభివృద్ధి సమన్వయమే కూటమి ప్రభుత్వ లక్ష్యం– ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
–'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో 33వ వార్డులో ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే సలాం ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తోందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న "ఇంటింటికీ తెలుగుదేశం" కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 33వ వార్డులో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసిన...