SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 4:21 pm Posted by : SALAM PRODDATUR

సంక్షేమం–అభివృద్ధి సమన్వయమే కూటమి ప్రభుత్వ లక్ష్యం– ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

–’ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో 33వ వార్డులో ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

 

సలాం ప్రొద్దుటూరు:

కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తోందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 33వ వార్డులో ఆయన విస్తృతంగా పర్యటించారు.

 

ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసిన ఎమ్మెల్యే, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించడంతో పాటు అవి లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పథకాల అమలులో ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు తెలిపిన పలు సమస్యలు, ఫిర్యాదులపై అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు చేపట్టారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయడం లేదన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా అధిక ఆదాయ వనరులు లేకపోయినా, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటోందని తెలిపారు. ప్రజల సహకారం, ఆశీర్వాదమే కూటమి ప్రభుత్వానికి బలమని ఆయన పేర్కొన్నారు.

 

కార్యక్రమంలో 33వ వార్డు మాజీ కౌన్సిలర్ గాజుల శివజ్యోతి, టీఎన్‌టీయూసీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు కుతుబుద్దీన్, అచ్చుకట్ల హుస్సేన్సా, నీలాపురం బాషా, పాలగిరి బాబా, గౌస్ మొద్దీన్, దాదాపీర్, చౌడమ్మ దేవాలయ కమిటీ అధ్యక్షుడు చిమ్మని శీను, వార్డు అధ్యక్షుడు దావూద్, జహీర్, తేజ తదితరులు పాల్గొన్నారు.

 

అలాగే టీడీపీ కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు, మాజీ పట్టణ అధ్యక్షుడు ఈ.వి. సుధాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ వద్ది బాలుడు, ఉప్పు మల్లిఖార్జున, సిద్ధయ్య, మదార్, మల్లిఖార్జున, బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంకదార నరేంద్రరావు, భూమిరెడ్డి భాస్కర్ రెడ్డి, కుమారి, పరమేశ్వరరావు, ముత్యాల శ్రీశ్రీ, జనసేన నాయకులు సుంకర మురళి, ప్రసాద్, మాజీ కౌన్సిలర్ జిలాన్, కమాల్ బాషా, పోసా భాస్కర్, బాబయ్య, వీరారెడ్డి, చెన్నారెడ్డి, పృథ్వీతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.