SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 6:47 pm Posted by : SALAM PRODDATUR

వైవీయూ డిగ్రీ ఫలితాల్లో ఆర్టీడీ విజయభేరి

 

 

–రెండో సంవత్సరం నాలుగో సెమిస్టర్ పరీక్షల్లో అత్యుత్తమ జీపీఏలు సాధించిన విద్యార్థులు

– అభినందించిన కళాశాల యాజమాన్యం

సలాం ప్రొద్దుటూరు :

యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) 2026 ఏప్రిల్‌లో నిర్వహించిన రెండో సంవత్సరం నాలుగో సెమిస్టర్ డిగ్రీ పరీక్షల ఫలితాల్లో స్థానిక రాణి తిరుమల దేవి కాలేజ్ ఆఫ్ సైన్సెస్ (ఆర్టీడీ) విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు మరోసారి విజయభేరి మోగించారు. వివిధ విభాగాల్లో పలువురు విద్యార్థులు 9.35 నుంచి 9.95 వరకు జీపీఏలు సాధించి విశిష్ట ప్రతిభను చాటుకున్నారు.

బీఎస్సీ బయోటెక్నాలజీ విభాగంలో ఆర్. నాగనీరజ 9.95 జీపీఏతో అత్యుత్తమ ఫలితం సాధించగా, టీ. అఫీఫా, కే. లావణ్య, ఎం. మౌనిక, ఎం. తస్లీమ్, నేహా తలా 9.70 జీపీఏలు, ఎన్.వి. స్వర్ణ 9.55 జీపీఏ సాధించారు.

బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఎస్. బాల కరిష్మా 9.85 జీపీఏతో అగ్రస్థానంలో నిలవగా, ఏ. శైలజ 9.45, ఎస్. దివ్య తేజ 9.35 జీపీఏలు నమోదు చేశారు.

బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగంలో ఎం. రాణి 9.65 జీపీఏతో ప్రతిభ కనబరచగా, ఎస్.కె. సన అంజు, ఎస్. సునీత తలా 9.50 జీపీఏలు, ఎస్. నుస్రత్ 9.35 జీపీఏ సాధించి కళాశాల ప్రతిష్ఠను మరింత పెంచారు.

ఈ సందర్భంగా విద్యార్థుల విజయాన్ని అభినందించిన కళాశాల ప్రిన్సిపాల్ టి. చంద్రశేఖర్ రెడ్డి, కరస్పాండెంట్ ఎల్. తరుణేంద్ర శేఖర్, వైస్ ప్రిన్సిపాల్ ఎస్. వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, అధ్యాపకుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారమే ఈ అద్భుత ఫలితాలకు కారణమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ విశ్వవిద్యాలయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని విద్యార్థులకు ఆకాంక్షలు తెలిపారు.

కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి, వారి ఉన్నత విద్యాభ్యాసంలో మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు.