SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 2:55 pm Posted by : SALAM PRODDATUR

మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటాం–కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్

 

 

–ప్రతి నెల మెడికల్ క్యాంపులు, మృత ఉద్యోగుల కుటుంబాలకు ఉపాధిపై హామీ

 

సలాం ప్రొద్దుటూరు:

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (APMEF) ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

 

ఫెడరేషన్ పట్టణ అధ్యక్షుడు ఎన్.బి. సాగర్, పట్టణ ప్రధాన కార్యదర్శి దప్పెల్ల దేవదాసు మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి నెలా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కోరారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ, ప్రతి నెలా మెడికల్ క్యాంపులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

 

అలాగే విధి నిర్వహణలో ఉండగా మరణించిన మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులకు నిబంధనల మేరకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరగా, సంబంధిత నిబంధనల ప్రకారం మహిళా కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించేలా చర్యలు చేపడతామని కమిషనర్ తెలిపారు. ఈ అంశాన్ని అమలు చేసేలా శానిటరీ సూపర్వైజర్ నూర్ బాషాకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

 

వినతిపత్రంపై వెంటనే స్పందించి, కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌కు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.