ఏబీవీపీ విద్యాసంస్థల బంద్‌కు ప్రొద్దుటూరులో మిశ్రమ స్పందన.. సహకరించని జూనియర్ కళాశాలలు

  –ఆగస్టు 5 బంద్ పిలుపు నేపథ్యంలో యథావిధిగా కొనసాగిన తరగతులు   సలాం  ప్రొద్దుటూరు: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో, ప్రొద్దుటూరులోని పలు జూనియర్ కళాశాలలు బంద్‌కు సహకరించలేదు. కళాశాలలు యథావిధిగా తెరుచుకుని తరగతులను నిర్వహించాయి.   బంద్‌కు మద్దతుగా ఏబీవీపీ నాయకులు విద్యాసంస్థలను మూసివేయాలని కోరినప్పటికీ, పలువురు కళాశాలల యాజమాన్యాలు తమ విద్యా కార్యక్రమాలను కొనసాగించాయి. దీంతో విద్యార్థులు సాధారణ రోజుల మాదిరిగానే తరగతులకు హాజరయ్యారు.  ...