ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది– రాచమల్లు
–'వాతలు, కోతలు, ఎగవేతలే పాలన.. –ప్రచారం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు' – దొరసానిపల్లెలో మీడియా సమావేశంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన రాచమల్లు సలాం ప్రొద్దుటూరు, దొరసానిపల్లె: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. బుధవారం దొరసానిపల్లెలోని తన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...