స్వచ్ఛ సంకల్ప దీక్షలో భాగస్వాములు కావాలి–కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్

సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా, ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలక సంఘం ఆధ్వర్యంలో "స్వచ్ఛ సంకల్ప దీక్ష" కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ ప్రజలందరూ సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానుకుని, ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు, జూట్ సంచులు వంటి పర్యావరణహిత వస్తువులను ఉపయోగించాలని కోరారు.   ప్రతి కుటుంబం తప్పనిసరిగా రెండు బుట్టల విధానాన్ని అమలు చేయాలని సూచించారు. తడి...