సెమిస్టర్ ఫలితాల్లో ప్రతిభ చాటిన శ్రీ వేదవ్యాస డిగ్రీ కళాశాల విద్యార్థులు

సలాం ప్రొద్దుటూరు: యోగి వేమన విశ్వవిద్యాలయం విడుదల చేసిన డిగ్రీ నాల్గవ సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో శ్రీ వేదవ్యాస డిగ్రీ కళాశాల విద్యార్థులు విశ్వవిద్యాలయ స్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరిచారని కళాశాల కరస్పాండెంట్ ఎల్. నాగేశ్వర రెడ్డి  మంగళవారం తెలిపారు.   బీఎస్సీ విభాగంలో ఎస్. రేణుక, టి. మానస చెరో 9.70 సీజీపీఏతో అగ్రస్థానంలో నిలవగా, పి. సుబ్బమ్మ 9.55, ఎ. సుప్రజ 9.40, యు.ఎస్. లైబా 9.35 సీజీపీఏ సాధించి ప్రతిభ చాటారు.   బీకాం విభాగంలో జి. అనిత 9.80...