సలాం ప్రొద్దుటూరు:
యోగి వేమన విశ్వవిద్యాలయం విడుదల చేసిన డిగ్రీ నాల్గవ సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో శ్రీ వేదవ్యాస డిగ్రీ కళాశాల విద్యార్థులు విశ్వవిద్యాలయ స్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరిచారని కళాశాల కరస్పాండెంట్ ఎల్. నాగేశ్వర రెడ్డి మంగళవారం తెలిపారు.
బీఎస్సీ విభాగంలో ఎస్. రేణుక, టి. మానస చెరో 9.70 సీజీపీఏతో అగ్రస్థానంలో నిలవగా, పి. సుబ్బమ్మ 9.55, ఎ. సుప్రజ 9.40, యు.ఎస్. లైబా 9.35 సీజీపీఏ సాధించి ప్రతిభ చాటారు.
బీకాం విభాగంలో జి. అనిత 9.80 సీజీపీఏతో అత్యుత్తమ ఫలితం సాధించగా, ఎస్. సబిహా బీ 9.50, జి. హారిత 9.50, పి. శివ హర్ష 9.25 సీజీపీఏతో ఉత్తమ ఫలితాలు నమోదు చేశారు.
ఈ సందర్భంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రెసిడెంట్ జి. సుదర్శన రెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రామలక్ష్మి రెడ్డి, యాసిన్, నాగరాజ్‌తో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.