మైదుకూరు 5వ వార్డులో ఘనంగా ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమం
సలాం ప్రొద్దుటూరు (మైదుకూరు): మైదుకూరు పట్టణంలోని 5వ వార్డులో ‘ఇంటింటికి టీడీపీ’ (డోర్ టు డోర్) కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు, 5వ వార్డు ఇన్‌చార్జ్ షేక్ అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న...