SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 1:13 pm Posted by : SALAM PRODDATUR

మైదుకూరు 5వ వార్డులో ఘనంగా ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమం

 

 

సలాం ప్రొద్దుటూరు (మైదుకూరు):

మైదుకూరు పట్టణంలోని 5వ వార్డులో ‘ఇంటింటికి టీడీపీ’ (డోర్ టు డోర్) కార్యక్రమాన్ని మంగళవారం  ఘనంగా నిర్వహించారు.  ఎమ్మెల్యే  పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు, 5వ వార్డు ఇన్‌చార్జ్ షేక్ అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

 

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో టీ.ఎన్.టి.యూ.సీ పట్టణ అధ్యక్షుడు, 101వ బూత్ ఇన్‌చార్జ్ కమాల్ భాష, సీనియర్ నాయకుడు బాలసుబ్బయ్య, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి రాకెట్ రఫీ, మైదుకూరు ఐటీడీపీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు షేక్ ఆసీఫ్ హుస్సేన్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.