ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుతాం– మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్

  సలాం  ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడమే మున్సిపాలిటీ లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు. పట్టణ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.   సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి, గుడ్డ సంచులు, జూట్ బ్యాగులు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచించారు. వ్యాపారులు, హోటల్ యజమానులు, దుకాణదారులు నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని కోరారు.   పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన ప్రొద్దుటూరు నిర్మాణంలో ప్రతి...