SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 12:02 am Posted by : SALAM PRODDATUR

ప్రజా ఫిర్యాదులపై తక్షణ చర్యలకు కమిషనర్ ఆదేశాలు

 

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పురపాలక సంఘం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS (గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్) కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ స్వయంగా పరిశీలించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యల వివరాలను తెలుసుకున్నారు.

 

అనంతరం ప్రతి ఫిర్యాదును త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడం, ఫిర్యాదుల సత్వర పరిష్కారమే పురపాలక సంఘం ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.