కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరించిన టీడీపీ మండల అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి

    సలాం ప్రొద్దుటూరు  ( చాపాడు): మైదుకూరు ఎమ్మెల్యే  పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు చాపాడు మండలంలోని సిద్ధారెడ్డిపల్లె గ్రామంలో ఆదివారం "ఇంటింటికీ కూటమి ప్రభుత్వం" కార్యక్రమాన్ని నిర్వహించారు.   ఈ సందర్భంగా టీడీపీ చాపాడు మండల అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా అనే విషయాన్ని తెలుసుకుంటూ వారి సమస్యలను...