SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 4:47 pm Posted by : SALAM PRODDATUR

కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరించిన టీడీపీ మండల అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి

 

 

సలాం ప్రొద్దుటూరు  ( చాపాడు):

మైదుకూరు ఎమ్మెల్యే  పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు చాపాడు మండలంలోని సిద్ధారెడ్డిపల్లె గ్రామంలో ఆదివారం “ఇంటింటికీ కూటమి ప్రభుత్వం” కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

ఈ సందర్భంగా టీడీపీ చాపాడు మండల అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా అనే విషయాన్ని తెలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 

మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, జిల్లాలోనే మైదుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి కొనసాగిస్తున్నారని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో బూత్ ఇన్‌చార్జి వి. సుబ్బిరెడ్డి, డీలర్ ప్రతాప్ రెడ్డి, రాఘవరెడ్డితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.