సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే వరద
సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండల పరిధిలోని యానాది కాలనీ వద్ద ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం–2ను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదివారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా హాస్టల్‌లోని విద్యార్థులతో ఎమ్మెల్యే మాట్లాడారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు విద్యపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని సూచించారు. హాస్టల్‌లో అందిస్తున్న భోజనం నాణ్యత, వసతి సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాలను పరిశీలించి, కార్యాలయ రికార్డులను తనిఖీ చేశారు.హాస్టల్‌లో అసంపూర్తిగా ఉన్న...